
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో నాన్ వెజ్ (మాంసం, చేపలు, చికెన్ మొదలైనవి) అమ్మకాలు పూర్తిగా నిషేధమని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. నిబంధనలను ఉల్లంఘించి నాన్ వెజ్ విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. గుంటూరు నగర పరిధిలోని అన్ని నాన్ వెజ్ విక్రేతలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. నిషేధం అమలుని ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కమిషనర్.







