chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: గుంటూరులో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిపిఐ నివాళులు

GANDHI JAYANTI IN GUNTUR

మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “గాంధీని హత్య చేసిన గాడ్సే వారసులు నేడు దేశాన్ని పాలించడం దుర్మార్గం. బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ సవరణ చేయాలని చేసే కుతంత్రాలను సిపిఐ ప్రజలతో కలిసి తిప్పికొడుతుంది” అని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, “దేశంలో పెరుగుతున్న అసహనం, మత విద్వేషాలకు గాంధీ చూపిన అహింసే సమాధానం. యువత ఆయన ఆశయాలను గ్రహించాలి” అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, “గాంధీ చూపిన మార్గమే రాజ్యాంగాన్ని రక్షించే మార్గం. బిజెపి-ఆర్ఎస్ఎస్ కుతంత్రాలను అడ్డుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నగర కమిటీ సభ్యులు జంగాల చైతన్య, విరిగినేని వెంకటేశ్వర్లు, పి. వి.జగన్నాథం, ఆకీటి రామచంద్రుడు, చినపోతుల శ్రీనివాస్, మత్తే అరుణ్, ఆకీటి గోపాలకృష్ణ, లింగరాజు, సైదారావు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker