కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో బ్రాడీపేట ఎక్సైజ్ డి.సి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కల్తీ లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేశారు. కార్యక్రమాన్ని ని ధ్వంసం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నూరీ ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం సరఫరా చేశారంటూ గతంలో అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా కల్తీ మద్యం సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. కల్తీ మద్యం తయారీని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కల్తీ మద్యం తయారు చేసి సరఫరా చేసిన వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
1,009 Less than a minute