గుంటూరు పశ్చిమలో “సూపర్ సిక్స్ – సూపర్ హిట్ – స్త్రీ శక్తి” సభకు సన్నాహక సమావేశం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన జరిగింది. సోమవారం రోజున సాయంత్రం 4 గంటలకు ఏటుకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించబోయే “సూపర్ సిక్స్ – సూపర్ హిట్ – స్త్రీ శక్తి” సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… “సూపర్ సిక్స్” హామీలైన ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే “స్త్రీ శక్తి” పథకం సరికొత్త స్థాయిలో ప్రజల్లో ప్రశంసలు పొందుతున్నదని, ఈ పథకం ఆగస్ట్ 15న ప్రారంభమైనప్పటి నుంచి మహిళల్లో భరోసా, స్వావలంబన, నింపుకుందన్నారు. “సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఎన్డీయే కూటమి పరిపాలనలో మహిళా సాధికారత ప్రాముఖ్యాన్ని మరింత పెంచడం, స్త్రీ శక్తితో సహా ప్రజా శక్తిని కూడా కలిసి గుంటూరు పశ్చిమ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.ఈ సన్నాహక సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
238 Less than a minute