
గుంటూరు నార్త్ ప్యారిస్ ఏఈ.ఎల్.సి చర్చి పాలకవర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ 28, 29. 30 తేదీలలో నామినేషన్లు స్వీకరించారు. అనంతరం అక్టోబర్ 1, 2 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి చేశారు. అనంతరం అక్టోబర్ మూడో తేదీన నామినేషన్ల పరిశీలన చేశారు. నామినేషన్ల పరిశీలన అధికారులుగా ఏ ఈ ఎల్ సి మాజీ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మోజస్, ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కే. మోజస్ వ్యవహరించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 14 మంది అర్హులైన వారితో నార్త్ ప్యారిస్ చర్చి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వివరాలను రెవరెండ్ డాక్టర్ ఎస్.జే బాబూరావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో నకిలీ రిసిప్ట్లు పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నార్త్ ప్యారిస్ పీసీసీ ప్రతినిధులు జాలాది చిత్తరంజన్, బోరుగడ్డ రత్నాకర్, మేళం రమేష్ కుమార్, పెండెం రతన్, పేర్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు.







