నల్సా పథకాలపై జిల్లా పరిపాలన శాఖ వారి సమన్వయముతో న్యూ మాడ్యూల్ క్యాంపు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్సా పథకాలైన పేదరిక నిర్ములనకు సమర్ధవంతమైన అమలు పథకం 2015 మరియు మానసిక రోగులకు న్యాయ సేవలు మరియు వికలగులకు అమలు పథకం 2015 పై న్యూ మాడ్యూల్ లీగల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి ముఖ్య. అతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడికి వారి వారి విధులతో పాటు చట్టాల మీద కూడా అవగాహన కలిగివుండటం మన నైతిక బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో పాటుగా కస్టపడి పని చేసే తత్త్వం ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. మహిళలకు , పిల్లలకు, మద్యం, మత్తుకు బానిసలైన వారికి, అణగారిన వర్గాల వారికి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా లేని వారికి న్యాయ సహాయం అందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రజలకు అవహగానా లోపం వల్ల పథకాల యొక్క లబ్ధిని పొందలేకపోతున్నారని తెలిపారు. అర్హత కలిగిన వారికి ఫ్రీ గా లీగల్ ఎయిడ్ మరియు పరిష్కరించదగ్గ అన్ని కేసులలో లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకొని సత్వరమే న్యాయం పొందవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు కలిసి పని చేసి ప్రజలకు వారి హక్కులను తెలియచేసే ఇలాంటి అవగాహనా సదస్సులను నిర్వహించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి మరియు స్పెషల్ ట్రయిల్ అఫ్ ఎస్. సి .ఎస్ .టి ఆక్ట్ గుంటూరు . ఆర్ . శరత్ బాబు, ఒకటవ అదనపు జిల్లా జడ్జి వి . ఏ . ఎల్ . సత్యవతి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
231 1 minute read