కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంపై గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక పై సమన్వయ సమవేశం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ అద్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ .. అనుభంద శాఖల అధికారులు సమన్వయం తో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సన్నాహక దశలో జిల్లా, మండల స్థాయిలలో విభాగాల సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ప్రచార దశలో ప్రతి గ్రామంలో సమావేశాలు, మోడల్ ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. నమోదు దశలో గ్రామంలోని అన్ని కుటుంబాల వార్షిక వ్యవసాయ ప్రణాళికలు తయారు చేసి, రైతులను సహజవ్యవసాయంలోకి తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ నెలలో పూర్తి చేసి రాబోయే రబీ సీజన్‌కి సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు. రైతులందరినీ అనుభంద శాఖ అధికారులు సమన్వయం తో పని చేసి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి పథం లో నడిపించాలని ఆయన ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరావు గారు రైతుల అందరి చేత రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించేలా వారికి అవగాహన కల్పించే బాధ్యత మన అందరిపై ఉంది. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని పేర్కొన్నారు.గుంటూరు జిల్లా ఏ. పి. సి. ఎన్. ఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని 77 గ్రామాలకు విస్తరించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 21,957 మంది రైతులు 26,083 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ, APCNF మోడల్స్ (ATM, A-గ్రేడ్, న్యూట్రి గార్డెన్ మొదలైనవి)ను అవలంబిస్తున్నారు. రైతుల డేటా సేకరణ కోసం URVI యాప్ ఉపయోగిస్తున్నాట్లు వివరించారు. ఈ 77 గ్రామాల్లో రబీ సీజన్లో రబీ డ్రై సోయింగ్ తో మొదలుపెట్టి ATM, A-గ్రేడ్ నమూనాలను ప్రతి రైతు తో అమలు చేయిస్తామని ఆమె పేర్కొన్నారు.ప్రకృతి వ్యవసాయ రైతులు వారు పొందిన ప్రయోజనాలు పంచుకున్నారు. అదే విధంగా రసాయన వ్యవసాయ చేస్తూ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్(పి యమ్ డి యస్) పాటిస్తున్న రైతులు కూడా పాల్గొని ఈ పద్దతి ద్వారా వారికి రసాయన ఎరువులు వాడకం తగ్గిందని, పి యమ్ డి యస్ పద్దతి రైతులకి ఎంతో ఉపయోగకరం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ పి సి ఎన్ ఎఫ్ జిల్లా యాంకర్ గోపి చంద్ గారు, డి హెచ్ ఓ నరేంద్ర కుమార్ గారు, డి.ఆర్ .డి.ఎ పిడి విజయ లక్ష్మీ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
234 1 minute read