గుంటూరు పరిధిలోని తురకపాలెంలో గత ఏడాది నుంచి అసాధారణ మరణాలు సంభవిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ తెలిపారు. ఏడాదిలో 100 మంది చనిపోగా గడిచిన 3 నెలల రోజుల్లో 30 మంది మరణించారని తెలిపారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే తురకపాలెంలో నివశిస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. వరుసగా సంభవిస్తున్న మరణాలు పై వెంటనే అధ్యయనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు నళినీకాంత్, భావన్నారాయణ, అప్పారావు పాల్గొన్నారు.