
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా నాయకులు తురకపాలెం గ్రామంలో పర్యటించారు. అసాధారణ స్థాయిలో జరుగుతున్న మరణాలను పరిశీలించి, మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడారు. తురకపాలెంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన మద్యం ఇస్తున్నారు తప్ప స్వచ్చమైన తాగునీరు అందించడం లేదన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, పార్టీ నేతలు భావనారాయణ, నళినీకాంత్, ముత్యాలరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.








