ప్రజల నుండి అందే అర్జీలు, సేవా దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, బియాండ్ ఎస్ఎల్ఏ ఉంటే సంబందిత అధికారి, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులు, అధికారులు, సిబ్బందితో గ్రీవెన్స్, సేవా దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ విభాగాల వారీగా అర్జీల పరిష్కారం సమీక్షించి, మాట్లాడుతూ, విభాగాల వారీగా ప్రతి విభాగంలో సూపరిండెంట్ అర్జీల పరిష్కారంకు భాధ్యత తీసుకోవాలని, ఆర్జీల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఆపరేటర్లకు విధులు కేటాయించాలని ఆదేశించారు. వచ్చే వారం నుండి నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ అయిన వాటిని విభాగాదిపతే నేరుగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వ సేవలను నిర్దేశిత గడువు మేరకు అందించడం ప్రభుత్వ ఉద్యోగుల భాధ్యత అని అన్నారు.సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిటి ప్లానర్ రాంబాబు, ఇంచార్జి ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఇంచార్జి ఎంహెచ్ఓ రామారావు, మేనేజర్ బాలాజీ బాష విభాగాల అధికారులు, సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
239 1 minute read