Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

COLLECTOR INSPECTION PADDY PROCUREMENT

ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. సోమవారం మంగళగిరి మండలం కాజా గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు దశలు, సిబ్బంది చేపట్టాల్సిన అంశాలు, పరికరాల పనితీరు, రైతులకు చేసే సూచనలు, బస్తాలు ఏర్పాటు, రవాణా ఛార్జీల చెల్లింపు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వాటిపై సిబ్బందికి గల అవగాహనను పరిశీలించారు. సమీపంలో ఉన్న వేయింగ్ బ్రిడ్జిని స్వయంగా తనిఖీ చేసి లెక్కింపు విధానాన్ని పరిశీలించారు. అన్నదాతకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని పౌర సరఫరాల సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ఏ రైతు వద్ద ఎంత ధాన్యము వస్తుందో ముందే పరిశీలించి, దానికి కావలసిన గోనె సంచులు ముందే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గ్రామ వ్యవసాయ అధికారులు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నియమించిన సాంకేతిక సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు ఇబ్బందులు సృష్టించరాదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వి.ఏ.ఏ. లు జాగ్రత్త వహించాలని, రైతులకు ఎంతో  ఓర్పుగా సమాధానం చెప్పాలని వారిని  ఆదేశించారు. ఈ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రతి మండలంలో మండలస్థాయి అధికారులు  పర్యవేక్షణ చేయాలని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు వారి ధాన్యాన్ని దళారుల ద్వారా అమ్మి మోసపోకుండా తగిన ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చేయాలని, అలా కాని పక్షంలో ఆయా సిబ్బంది మీద  కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రతి అధికారి భాద్యత వహించాలని, ఏ ఒక్క రైతుకూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని తెలిపారు. ధాన్యం కొనుగోలులో  వేర్వేరు స్థాయిలో భాగస్వాములు కానున్న వ్యవసాయ, రెవెన్యూ, రోడ్డు రవాణా, లీగల్ మెట్రాలజీ, వివిధ శాఖల వారందరూ పరస్పర సహకారంతో వ్యవహరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయవలసిందిగా సూచించారు.పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె. తులసి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో చేపట్టే అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఖరీఫ్ 2025 – 26 సంవత్సరంలో గ్రేడ్ -ఏ రకానికి క్వింటాలుకు రూ.2,389/-, సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,369/-  ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. జిల్లాలో మొత్తం 177 రైతు సేవ కేంద్రాలను 45 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు, కల్లాల వద్ద ధాన్యం వాహనాల్లోకి ఎక్కించటానికి అయ్యే హమాలి ఖర్చు, మిల్ పాయింటుకు చేర్చడానికి రవాణా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, ఒకవేళ రైతులు సొంతంగా ఈ ఖర్చులు పెడితే ధాన్యం ఖరీదుతో పాటు వారి అకౌంట్లో 21 రోజులలోపు జమ చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం రవాణాకు జి.పి.ఎస్ అమర్చినవాహనాలలో మాత్రమే చేయటం ద్వారా మిల్లు పాయింట్ కు చేరే వరకు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యము, రైతు సేవకేంద్రం నుండి మిల్ పాయింట్ కు చేరిన తదువాత, అక్కడ మిల్లు యజమానులు రైతు సేవకేంద్రంలో సాంకేతిక సిబ్బందితో ధృవీకరించిన నాణ్యత ప్రమాణాల పరంగా అభ్యంతరాలను లేవనెత్తకుండా ఒకే విధమైన పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇందుకు కస్టోడియన్ అధికారిని నియమించడం జరుగుతుందని అన్నారు. క్లస్టర్ చేసిన ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద గుంటూరు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (GDCMS)చే నియమించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైన, కంట్రోల్ రూమ్ నంబర్ 9491392717 ను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి, తహసిల్దార్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button