ఆగష్టు 26న కొల్లిపర మండలం అత్తోటలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుర్గా ప్రసాద్, ఎలీషా అనే ఇరువురు పాత నేరస్తులను సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సీసీ కెమెరాలు ఆధారంగా దోపిడీ కేసును ఛేదించడం జరిగిందని తెలిపారు. ప్రజలు మరింతగా సహకరించి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.