జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాదుల ప్రణాళికలు సక్రమంగా అమలు కోసం డీఆర్డీడీఏ ను సమన్వయం చేసుకుంటూ సంబంధిత శాఖల అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన డీఆర్డీఏ- వెలుగు ఆధ్వర్యంలో జీవనోపాదుల కార్యక్రమాలు ( livelihood Activities) ప్రణాళిక అమలుపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అనేక పధకాల ద్వారా రాయితీతో కూడిన ఆర్ధిక సహాయంను అందిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం లఖ్ పతీ దీదీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఒన్ ఫ్యామిలీ, ఒన్ ఎంటర్పెన్యూర్ కార్యక్రమం ద్వారా స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సేవా, తయరీ రంగాల్లో వ్యాపార సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహాం అందిస్తున్నాయన్నారు. జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంశర్ధక శాఖ, పరిశ్రమల శాఖ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, నాచురల్ ఫార్మింగ్ తదితర రంగాల్లో అవకాశం ఉన్నందున వీటిలో లాభదాయకమైన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖల క్షేత్ర స్థాయి అధికారులు మహిళలను ప్రోత్సహించాలన్నారు. డీఆర్డీఏ లోని ఏపీవోలు, వీఏవోలు ప్రభుత్వ శాఖల్లో పరిశ్రమలు ఏర్పాటుకు అందిస్తున్న సహాయ, సహకారాలపై ఎస్ హెచ్ జీ మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఒన్ డిస్ట్రిక్ ఒన్ ప్రాజెక్ట్ ద్వారా ఎఫ్ పీ ఓ లు ఏర్పాటు చేసే క్లస్టర్ల లోను, పరిశ్రమల్లోను మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖల వార్షిక ప్రణాళికల్లోను మహిళా పారిశ్రామిక వేత్తల ప్రోత్సహానికి అవసరమై లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకర్లు ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా ఎల్డీఏం, డీడీఎం నాబార్డు సహకారం అందించాలన్నారు.
231 1 minute read