ఆంధ్రప్రదేశ్
GUNTUR….పల్నాడులో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించండి.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లాలో లెదర్ పార్క్ ఏర్పాటు కోసం టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన విదేశీ ప్రతినిధులతో కలిసి,, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ను కలిసి ప్రాజెక్ట్ ఏర్పాటు సహకరించాలని అభ్యర్థించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవంతిలో.. మంత్రి గారిని కలిసి ప్రాజెక్ట్ ఆవశ్యకతను వివరించారు. స్థల పరిశీలన విషయాలను, ప్రాజెక్టుతో జరిగే లబ్ధిని, ఉపాధి అవకాశాల గురించి.. మంత్రి టీజీ భరత్ తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ సీఈవో సాయి కాంత్ వర్మ ని, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తో ఈ లెదర్ పార్క్ ప్రాజెక్టు గురించి ప్రతినిధులతో కలిసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు.