Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur: పి.పి.పి విధానంలో వైద్య కళాశాలలు వద్దు – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు

ROUND TABLE DISCUSSION ON MEDICAL COLLEGES ISSUE

రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనరషిప్ విధానం ద్వారా ప్రైవేట్ వైద్య కళాశాలలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రముఖ వైద్యులు, ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 16 వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో పేదలకు వైద్య విద్య దూరమవాల్సిందేనా? అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. డా||ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు నాడు ప్రైవేట్ రంగంలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తే, నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగంలో ప్రకటించిన 10 వైద్య కళాశాలలను పి పి పి పేరుతో ఆర్థిక లబ్ధి, రాజకీయ లబ్ధి కోసం అనుమాయులకు కేటాయించాలని భావించటం క్షoతవ్యం కాదన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కళాశాలల్లో, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులల్లో రిజర్వేషన్లు అమలు కావని నీట్ పరీక్షలో 16 శాతం మార్కులు పొందిన వారికి కూడా లక్షలాది రూపాయల డొనేషన్ తో ఎంబిబిఎస్ సీట్లు కేటాయిస్తూ ప్రతిభకు పాతరేస్తున్నారని తెలిపారు. 95 శాతం ప్రజలకు 50 శాతం మెడికల్ సీట్లు కేటాయిస్తే కేవలం 5 శాతం ధనికులకు మిగిలిన 50 శాతం ఎంబిబిఎస్ సీట్లు కేటాయిస్తూ ప్రతిభ గల పేద విద్యార్థులను శాశ్వతంగా వైద్య విద్యకు దూరం చేస్తున్నారన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో స్టైఫెండ్స్ ఇవ్వడం లేదని సి కేటగిరిలో 2 నుండి 3 కోట్లకు ఎంబిబిఎస్ సీట్లు అమ్ముకుంటున్నారని తెలిపారు. మాజీ శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి లోక్ సభకు ఒక వైద్య కళాశాల ఉండాలనే విధాన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ కు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుమతిస్తూ 60 శాతం నిధులను కేటాయిస్తే, నేడు చంద్రబాబు నాయుడు సరైన నిధులు లేవనే నెపంతో 10 మెడికల్ కళాశాలలను పి పి పి విధానానికి మార్చడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 15 సంవత్సరాలలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా స్థాపించలేదని, ప్రైవేట్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓవైపు యోగాంధ్ర లాంటి ఈవెంట్స్ లకు వందలాది కోట్లు ఖర్చు చేస్తూ మరోవైపు పేదలకు వైద్యవిద్య, వైద్యం అందించే వైద్య కళాశాలలకు, అనుబంధ ఆసుపత్రులకు నిధులు లేవని ముఖ్యమంత్రి చెప్పడం బాధాకరమన్నారు. 10 మెడికల్ కళాశాలల్లో 500 ఎకరాల ప్రభుత్వ భూమి, నిర్మాణాలతో కలిపి 2 వేల కోట్లు ఆస్తులను ప్రైవేట్ రంగానికి కట్ట పెట్టాలని చూస్తున్నారన్నారు. సేవారంగంలో ఉండాల్సిన విద్య వైద్య రంగాలను వ్యాపారమయంగా చేయడం దురదృష్టకరమన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్.రంగయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వాలు విద్య, వైద్య రంగంపై ఖర్చు చేయకుండా బుల్లెట్ రైళ్లు, ఐకానిక్ భవనాలు, మెట్రో ప్రాజెక్టుల పై ఖర్చు చేయటం భావ్యమా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకోవాలన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ గతంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నకిలీ అనుమతులతో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న సంగతిని గుర్తు చేశారు. సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ ప్రైవేట్ వైద్య విద్య ఖరీదుగా మారడంతో వైద్యులలో వ్యాపార ధోరణి పెరగడం ద్వారా రోగులు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్.ఆర్.సి.పి. విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పి. చైతన్య, ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజరజీ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి యశ్వంత్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, బిసి జన మహా సభ కన్వీనర్ ఉగ్గం సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. ప్రముఖ వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణ కమిటీని త్వరలో ప్రకటిస్తామని అందులో విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మేధావులు స్వచ్ఛంద సంస్థల నేతలు ఉంటారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button