రహదారుల అభివృద్ధి విషయంలో పెండింగ్ పనులుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలుపై కలెక్టర్ కార్యాలయంలో ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్, కమీషనర్ పులి శ్రీనివాసులు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు.
GUNTUR NEWS: ముఖ్యమంత్రి సహాయ నిధి..జిల్లాలో 12 గ్రామ పంచాయతీ భవనాలకు అనుమతులు వచ్చాయని తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్లు నగరపాలక సంస్థకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.ప్రారంభం కాని రహదారులపై స్పెషల్ ఫోకస్ పెట్టామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే మెటీరియల్ అందించే విషయంలో మైనింగ్ విభాగం నిర్లక్ష్యంగా వుందన్నారు. కాంట్రాక్టర్లకు సహకారం అందించని పక్షంలో చర్యలు తప్పవని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. Nandha Jyothi