
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విజయవంతం అయ్యే ప్రక్రియలో ప్రభుత్వ అంకితభావం, శాస్త్రీయ ప్రమాణాలు, రైతు సాధికార సంస్థ (RySS) వంటి ప్రత్యేక సంస్థల ఏర్పాటు, దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ద్వారా వచ్చిన మహిళా సాధికారత అని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో 40 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. GUNTUR NEWS.:లభించిన బాలు మృతదేహం..
బ్రెజిల్ ప్రతినిధులతో సోమవారం గుంటూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బ్రెజిల్, యూఏఈ, శ్రీలంక దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు తమ అనుభవాలు, పరిశీలించిన అంశాలను ఈ సమావేశంలో పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వస్తున్న సానుకూల మార్పు, ముఖ్యంగా మహిళలు పోషిస్తున్న క్రియాశీలక పాత్రను బృంద సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీ రాజశేఖర్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) విధానం పాత పద్ధతులకు తిరిగి వెళ్లడం కాదని, నిరంతరం అభివృద్ధి చెందుతూ రసాయన వ్యవసాయానికి సవాల్ గా మారిన శాస్త్రీయ విధానమని పేర్కొన్నారు. Guntur: ఒకే ఒక్కడు…. 50 బైక్ లు ఎత్తుకెళ్లాడు
సృజనాత్మకతతో కూడిన ప్రకృతి వ్యవసాయం స్థిరమైన, పునరుత్పత్తి చేయగల పరిష్కారాలను అందిస్తోంది” అని అన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం అత్యవసరమని, రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 40% భూభాగం ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన తెలిపారు.







