
రాష్ట్రంలో సుమారు 143 వెనుకబడిన కులాలు ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయంగా సీట్లు తగ్గించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ తెలిపారు. దీంతో వేల సంఖ్యలో బీసీ ప్రతినిధులు ఎన్నికల హక్కులను కోల్పోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్నా, మరోవైపు కులగణన చేపట్టడంలో ఆసక్తి చూపకపోవడం దురదృష్టకరమని చెప్పారు. వెనుకబడిన కులాల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈనెల 7వ తేదీన కొత్తపేట సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.







