
జిల్లాలో ఎన్.టి.ఆర్ భరోసా పించన్లు పంపిణీ కార్యక్రమం బుధవారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛనుదారులకు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఆదేశించారు. మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174., వితంతువులు 70,112., చేనేతకారులు 3,862., గీతకార్మికులు 443., మత్స్యకారులు 570., ఒంటరి మహిళలు 11,330., చర్మకారులు 876., హిజ్రాలు 67., హెచ్.ఐ.వి బాధితులు 2,614., కళాకారులు 77., డప్పు కళాకారులు 854., దివ్యాంగులు 24,835., వైద్య సంబంధిత పింఛనుదారులు 1667., సైనిక సంక్షేమం 28., అభయహస్తం 3,994., అమరావతి భూముల సంబంధిత 17,401 పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. బుధవారం ఉదయం నుండి పంపిణీ జరుగుతుందని, సిబ్బంది సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.







