Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

GUNTUR..మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం…ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

ప్ర‌తిష్టాత్మ‌క మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పూర్తి
స‌హాయ స‌హ‌కారాలందిస్తుంద‌ని త‌న‌ను క‌లిసిన నూత‌న ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ ఇచ్చారు. శుక్ర‌వారంనాడు వెల‌గ‌పూడి ఎపి స‌చివాల‌యంలో మంత్రిని ఆయ‌న మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ భౌగోళికంగా మంగ‌ళ‌గిరిలోని సుంద‌ర‌మైన, ఆహ్లాదభరితమైన కొండ‌ల నడుమ ఎయిమ్స్ ను కేంద్ర‌ప్ర‌భుత్వం నెల‌కొల్పింద‌న్నారు. 2018లో ప్రారంభ‌మైన దీనికి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంచి నీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించ‌లేద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించింద‌ని, అలాగే ప్ర‌త్యామ్నాయ విద్యుత్ స‌ర‌ఫ‌రాను కూడా క‌ల్పించింద‌న్నారు. 183 ఎక‌రాల్లో ఏర్పాటైన ఎయిమ్స్ లో ట్రామా కేర్ సెంట‌ర్ ఏర్పాటుకు స్థ‌లం లేనందున‌, కొల‌నుకొండ‌లో 10 ఎక‌రాల స్థ‌లాన్ని మంజూరు చేసేందుకు ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబు నాయుడు ఇటీవలే ఆదేశాలిచ్చార‌న్నారు. త్వ‌రిత‌గ‌తిన ట్రామాకేర్ సెంట‌ర్‌ను నిర్మించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని, అలాగే 965 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా మంజూరైన ఎయిమ్స్ లో ప్ర‌స్తుతం 650 ప‌డ‌క‌లున్నాయ‌ని, విస్త‌ర‌ణ‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్ శాంతాసింగ్‌కు ఈ సంద‌ర్భంగా మంత్రి సూచించారు. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ అభివృద్ధికి భ‌విష్య‌త్తులో అన్ని విధాలా స‌హ‌క‌రించేందుకు కూట‌మి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button