37 రకాల మందులు మీద జీఎస్టీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వైద్య, ఆరోగ్య రంగంలో పూర్తిగా పరిష్కారం లభించదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తెలిపింది. ఈమేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడుసి.హెచ్ కుమార్, జిల్లా సెక్రెటరీ అబ్దుల్ సలీం బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మందులు పైన కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచుతున్న విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ లో మెడికల్ రిప్స్ పని చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోరుతూ నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్ మల్లికార్జునరావు, ఫణి, అనిల్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
231 Less than a minute