గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదివారం పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. ప్రధానంగా 38వ డివిజన్ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్, 39వ డివిజన్ మారుతి నగర్, గుజ్జనగుండ్ల సెంటర్, ఉద్యోగ నగర్ తదితర ప్రాంతాల్లోని గణపతి మండపాల్లో ఎమ్మెల్యే పూజలు చేశారు. అనంతరం బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల సెంటర్, 31వ డివిజన్ ఏటి అగ్రహారం జీరో లైన్, 30వ డివిజన్ ఏటి అగ్రహారం 7వ లైన్‌లలో జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న శుభ్రతా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నాయి. గణపతి ఆశీస్సులతో గుంటూరు పశ్చిమ మరింత ముందుకు సాగుతుంది” అని పేర్కొన్నారు.
231 Less than a minute