
వైద్య రంగాన్ని వైఎస్ జగన్ సేవగా భావిస్తే కూటమి ప్రభుత్వం వ్యాపారంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈమేరకు పార్టీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్య విద్యను పేదలకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మోదుగుల, పోతిన వెల్లడించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసిన కారణంగా వైద్యం ఇకనుంచి పేదలకు భారం అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.







