పేదవాడి గుండె చప్పుడు తెలిసిన నిజమైన ప్రజా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ కీర్తించారు. స్థానిక 32వ డివిజన్‌లో కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) ఆధ్వర్యంలో వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, విలువలు, విశ్వసనీయతకు సరైన నిర్వచనం రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం అని పేర్కొన్నారు. ఆయన నడవడిక నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రగతి, సంక్షేమ పధకాల సాక్షిగా “రాజన్న అమరం – ప్రజల గుండెల్లో పదిలం” అని ప్రస్తుతించారు.కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) మాట్లాడుతూ, సంక్షేమ పథకాల సృష్టికర్త డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని శ్లాఘించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న వైయస్సార్ ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వెలుగూరి రత్నప్రసాద్, బత్తుల దేవానంద్, భాగ్యారావు, శంకర్, విజయమ్మ, విజయమాధవి, శ్రావణి, గనిక జాన్సీ, డేవిడ్, సింగు నరసింహారావు, సాంబశివరావు, సాగర్ రెడ్డి, ఆదిలక్ష్మి, సంజీవరెడ్డి, గంగాధరరెడ్డి, పుల్లారెడ్డి, పండ్ల నారాయణ, చందు, వెంకటరెడ్డి, గోపీకృష్ణ, రెడ్డి కోటేశ్వరరావు, సుబ్బరాజు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
241 1 minute read