
దేశ సరిహద్దుల్లో సైనిక స్థావరంలో యుద్ద విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని సైనిక స్థావరంలో యుద్ద విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు.
దేశ సేవ పై మక్కువతో సైన్యంలో చేరి ఇలా విన్యాసాలు చేస్తూ ప్రమాదవశాత్తు భరద్వాజ్ మరణించడంతో అటు సైన్యంలోనూ, అటు కుటుంబంలోనూ తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం సాయంత్రానికి సంగడిగుంట నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.







