
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద, నెహ్రూనగర్ పంప్ హౌస్ వద్ద జరుగుతున్న ప్రధాన పైపులైన్ ఇంటర్ కనెక్షన్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ…. పనులు నిర్దేశిత సమయానికి పూర్తవ్వాలని, తాగునీటి సరఫరా యధావిధిగా కొనసాగించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల వేగవంతానికి షిఫ్ట్‌ల వారీగా అధికారులను కేటాయించి, కాంట్రాక్టర్‌తో సమన్వయం సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇంటర్ కనెక్షన్ ప్రాంతంలో ఈఈలు, డిఈఈలు పర్యవేక్షణ చేస్తూ, ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అందించాలనేది కూడా ఆమె ఆదేశించారు.
 
 
 
  
 






