chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రకటించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

GUNTUR COLLECTOR PRESS MEET

గుంటూరు జిల్లాకు లభించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా గురువారం ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎస్.ఆర్. శంకరన్ మినీ సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి అవార్డులు, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు. వివరాలను స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (SASA) పోర్టల్ (https://sasa.ap.gov.in/) లో పొందుపరచడం జరిగిందని చెప్పారు.స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రోత్సాహక అవార్డులు – 2025కు, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమాల కింద స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన ప్రశంశనీయ కృషిని గుర్తించడానికి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (తగ్గించటం, మళ్లీ ఉపయోగించడం, రీసైకిల్), సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పని చేయడం జరిగిందన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీలలో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను గుర్తించడానికి, అన్ని రంగాలలో ఉన్న వారి భాగస్వామ్యం పెంచుటకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. స్వయం మూల్యాంకనం, జిల్లా అధికారుల పరిశీలన, తృతీయ పక్ష మూల్యాంకనంగా మూడు దశల్లోస్వచ్ఛ ఆంధ్ర అవార్డులు – 2025 రేటింగ్/ర్యాంకింగ్  జరిగిందన్నారు.  స్వయంమూల్యాంకనంలో 1,20,057 కేంద్రాలు పాల్గొన్నాయని, జిల్లా స్థాయి పరిశీలనలో 1,12,833 కేంద్రాలలో నిర్వహించడం జరిగిందని, దీనివల్ల 1,317 జిల్లా స్థాయి నామినేషన్లు ఎంపిక అయ్యాయన్నారు.చివరిగా 62 ఎంట్రీలు రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం పోటీ పడడం జరిగిందని, మొత్తం మూల్యాంకన ప్రక్రియ పూర్తిగా డిజిటల్ గా – సాసా పోర్టల్, మొబైల్ యాప్ తో ఏకీకృతం చేయడం జరిగిందని తెలిపారు. 2025 అక్టోబర్ 6న విజయవాడలో రాష్ట్ర స్థాయి అవార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్రా (SASA) ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఈ అవార్డులు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker