
గుంటూరు పరిధిలోని కాటన్, జిన్నింగ్ మిల్లులలో పని చేస్తున్న కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈమేరకు ఏటుకూరు రోడ్ లోని రేగుల రాఘవయ్య భవన్ లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం నేతలు చల్లా చిన ఆంజనేయులు, జీ. సురేష్, రావుల అంజిబాబు మీడియాతో మాట్లాడారు. కాటన్ పరిశ్రమ అభివృద్ధి చెంది వ్యాపారులు లాభాలు పొందుతున్నారని చెప్పారు. అయితే కార్మికులు మాత్రం నష్ట పోతున్నారని తెలిపారు. ఒకరోజు సమ్మె కారణంగా 11 శాతం కూలీ రేట్లు పెంచేందుకు అంగీకరించారని అన్నారు. కానీ కొందరు వ్యాపారులు కుట్రలు చేసిన కారణంగా ఒప్పందాలు అమలు చేయడం లేదన్నారు. అనివార్య పరిస్థితుల్లో జిన్నింగ్, టీఎంసీ మిల్లుల కార్మికులు సమ్మెలోకి వెళ్లడం జరిగిందని వారు వెల్లడించారు.







