జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కక్షిదారులు తమ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
2,233 Less than a minute