
గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద సంగంజాగర్లమూడి నుండి నాజ్ సెంటర్ రిజర్వాయర్ కి త్రాగునీటి సరఫరా జరిగే 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను ఈ నెల 23(గురువారం) ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. ఈ పనుల వలన 23 (గురువారం) ఉదయం నుండి 25 (శనివారం) ఉదయం వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పైప్ లైన్ మరమత్తు పనుల వలన నాజ్ సెంటర్ (ఎల్ఎల్ఆర్) రిజర్వాయర్ పరిధిలోని పొత్తూరివారి తోట, గుంటూరువారితోట, కొత్తపేట, రాజాగారితోట, సాంబశివరావుతోట, రామిరెడ్డితోట, ప్రకాష్ నగర్, రైల్ పేట, గణేష్ రావు పేట, అహ్మద్ నగర్, శీలంవారి వీధి, లాలాపేటలో కొంత ప్రాంతం, పట్నంబజార్ లోని కొంత ప్రాంతం, చౌత్ర సెంటర్ లోని కొంత ప్రాంతం, ఏటుకూరు మెయిన్ రోడ్, చిన్న బజార్ లోని కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని చెప్పారు. తిరిగి 25 సాయంత్రం పాక్షింగా, 26వ తేదీ నుండి యధావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. కావున నగర ప్రజలు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకొని, నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.







