ఆప్కాస్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కారంగా గుంటూరు నగరంలో త్రాగు నీటి సరఫరాకు అంతరాయం కలుగకూడదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు తెలిపారు. మంగళవారం గుంటూరు నగరానికి త్రాగునీటిని సరఫరా చేయడంలో ప్రధానమైన తక్కెళ్ళపాడులోని హెడ్ వాటర్ వర్క్స్ నందు పర్యటించి త్రాగునీటి సరఫరా, ఫిల్టరేషన్లను పరిశీలించి, సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడారు.
తొలుత మేయర్ గారు తక్కెళ్లపాడు రోడ్ లోని నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి, తదుపరి సమ్మె చేస్తున్న కార్మికుల శిబిరంలోకి వెళ్లి, కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ, సమ్మె కారణంగా నగరంలో త్రాగు నీటి వలన త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగకూడదని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందన్నారు. తాము కూడా ఆప్కాస్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మునిసిపల్ శాఖా మంత్రివర్యులు నారాయణ గార్ల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఇచ్చిన హామీ మేరకు సమ్మె చేస్తున్న కార్మికులలో కొంతమంది సమ్మె విరమించి విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా మేయర్ గారు ఇంజినీరింగ్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న సమ్మె కారణంగా త్రాగు నీటి సరఫరాలో ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఉండవల్లి నుండి సరఫరాకి, ఫిల్టరేషన్ కి సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, యస్.ఈ నాగమల్లేశ్వరరావు, డి.ఈ.ఈ శ్రీనివాసరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.