Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం…

AITUC FORMATION DAY IN GUNTUR

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పని గంటల పెంపును రద్దు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పారు. ఎనిమిదవ పే కమిషన్ ద్వారా ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఐక్య ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై సమరశీల పోరాటాలు నిర్వహించడానికి కార్మిక వర్గం యావత్తు సంసిద్ధంగా ఉన్నారని CPI జిల్లా కార్యదర్శి& AITUC జిల్లా ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, AITUC రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు తెలిపారు. ఏఐటియుసి 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం గుంటూరు నగరంలోని నగరముఠాకార్మిక సంఘం కార్యాలయం రేగుల రాఘవయ్య భవనం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జెండాను రాధాకృష్ణమూర్తి, సిపిఐ జెండాను కోట మల్యాద్రి ఆవిష్కరించారు. అలాగే కార్మిక హక్కుల కోసం నిరంతరం శ్రమించిన కామ్రేడ్ జీవి కృష్ణారావు విగ్రహానికి చల్లా చిన్న ఆంజనేయులు పూలమాలతో నివాళి అర్పించారు. ఏఐటియుసి 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల క్రితం నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తానని హామీతో అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి తేకపోగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను బడా పారిశ్రామికవేత్తల కోసం 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా తయారుచేసి పార్లమెంటు ఆమోదం కోసం పెట్టడం జరిగిందని. కార్మిక సంఘాల ఐక్య ఉద్యమాల ద్వారా ఆ చట్టాలను వ్యతిరేకించడం జరుగుతుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రూపాయల రాయితీ కల్పిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడంలో చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం జరుగుతుందని బడా పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన కొనసాగించడం జరుగుతుందని కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాలకు ప్రజా ఉద్యమాల ద్వారా తగిన గుణపాఠం చెప్పటం జరుగుతుందని అలాగే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్డిఏ బిజెపికి నరేంద్ర మోడీ కు జి హుజూర్ అంటూ ఏ రాష్ట్రంలో అమలు చేయని చట్టాలను మన రాష్ట్రంలో అమలు చేస్తామని పని గంటల పెంపు విధానాన్ని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం చాలా దుర్మార్గమని నరేంద్ర మోడీ మెప్పుకోసం చంద్రబాబు చేస్తున్న పనులకు కార్మిక వర్గం ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరించారు. కార్మిక హక్కులను పరిరక్షించడం కోసం ఏఐటియుసి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఐక్య ఉద్యమాల సమరశీల పోరాటాలు నిర్వహించటం జరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటియుసి నగర గౌరవాధ్యక్షులు జి సురేష్ బాబు, AITUC నగర అధ్యక్షులురావుల అంజిబాబు, నగర ముఠా కార్మిక సంఘం నాయకులు పోనుగోటి వెంకటరెడ్డి,SP కొండయ్య,బోయపాటి శ్రీకాంత్ రేగుల రాఘవ, కొత్త నాని, రేగుల నవీన్, రామినేని శ్రీనివాసరావు, తోక శ్రీనివాసరావు, పప్పుల రోసి రెడ్డి, మల్లెబోయిన పిచ్చయ్య, కొండ, కోంగలి కోటయ్య, గోవాడ సాంబయ్య, కోట్ల మరియదాసు, శ్రీనివాసరావు వివిధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button