
గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగం రోజురోజుకూ పెరుగుతోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మంగళవారం భాగ్యనగర్, వికాస్‌నగర్, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్ ప్రాంతాలలో రూ.2 కోట్ల 66 లక్షల విలువైన రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ 36వ డివిజన్ భాగ్యనగర్ ప్రాంతం గతంలో వెనుకబడిన డివిజన్ గా ఉండేది. ఇప్పుడు అన్ని మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి, రోడ్లు, డ్రైన్లు, లైట్స్ వంటి పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నాము. ప్రజల సహకారంతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి వైపు వేగంగా దూసుకెళ్తోంది” అని అన్నారు.ఈ రోజే 42వ డివిజన్‌లో వికాస్‌నగర్ మరియు ఎస్వీఎన్ కాలనీ ప్రాంతాలలో మొత్తం రూ.2.66 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన మరియు 63 లక్షల రూపాయల రోడ్డు పనిని పూర్తి చేసి ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లలా ముందుకు సాగుతున్నాయి. అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి కట్టుబడి ఉన్నాము. ప్రజల సహకారమే మా బలం” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్ పరిసరాల్లో హెవీ లోడ్ టిప్పర్ల రాకపోకలతో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తుచేశారు. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేసినట్లు, కానీ ఇది తాత్కాలిక పరిష్కారమని పేర్కొన్నారు. దీని కోసం ట్రాఫిక్ సిఐ, డిఎస్పీ అధికారులను సంప్రదించి, అక్కడ నిరంతర పర్యవేక్షణకు ఒక కానిస్టేబుల్ లేదా ఎస్ఐని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఒక రెండు రోజుల్లోనే దానికి పరిష్కారం వస్తుంది. ప్రజల ఇబ్బందులను తగ్గించే దిశగా మేము నిరంతర కృషి చేస్తున్నాము” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.







