
చట్టసభల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని పలువురు నేతలు సూచించారు. ఈమేరకు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అరండల్ పేటలో ఆదివారం బీసీ రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీసీ లకు రిజర్వేషన్ తోపాటు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్-ప్లాన్ అమలు కోసం నిధులు కేటాయించాలని కోరారు. బీసీ లకు రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అసెంబ్లీ, పార్లమెంటు లో తీర్మానాలు చేయాలని చెప్పారు.







