Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: విభజించు –పాలించు అనే విధంగా అధికారుల ధోరణి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం

GUNTUR MLA MADHAVI FIRE ON OFFICIALS

గుంటూరులో విభజించు పాలించు అనే విధంగా అధికారుల ధోరణి ఉందని, నియోజకవర్గములో ఉన్న ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు వచ్చే విధంగా అధికారులు రాజకీయం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దిశా నిర్దేశాల మేరకు అత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. గుంటూరు పశ్చిమలో కూడా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి మా ద్వారా పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. కానీ అదే సమయంలో అధికారులు మరో చోట వేరే కార్యక్రమం నిర్వహించడం, ఆ కార్యక్రమానికి కనీస సమాచారం ఇవ్వకపోవటం ఏంటని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మండిపడ్డారు. అసలు అధికారులు రెండు విడివిడిగా కార్యక్రమాలు అవసరమా? మేయర్ , కమిషనర్ ఒక వైపు కార్యక్రమం చేసి మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. నేను పాల్గొన్న పంపిణీ కేంద్రంలో వారు లేరు, కానీ నాకు తెలియకుండా వారు నా నియోజకవర్గములో కనీస మర్యాద పాటించకుండా కార్యక్రమం నిర్వహించటం నాకు చాలా బాధ కలిగించిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రోటోకాల్ ఎక్కడ? బ్యానర్లలో ప్రజాప్రతినిధులు ఎందుకు లేరు? మేయర్ , కమిషనర్ నిర్వహించిన కార్యక్రమ బ్యానర్‌లో స్థానిక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఫోటోలు లేవు. అలాగే తాను పంపిణీ చేసిన చోట మోడీ , మేయర్ ఫోటోలు లేవు. అంటే అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం తీవ్రంగా ఆవేదన కలిగిస్తోంది,” అని వ్యాఖ్యానించారు. ఇది అమాయకత్వమా? అవివేకమా? లేక అహంకారమా? ఈ ‘విభజించు–పాలించు’ విధానం ఎందుకు? ఎవరు ఈ ప్లాన్ చేశారు? రెండు ప్రోగ్రాములు ఎందుకు జరిగాయి? ఇది గవర్నమెంట్ కార్యక్రమం కదా — అందరూ కలిసికట్టుగా చేయాల్సినది. ఇలాంటి చర్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి?” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా కార్యక్రమాలు ఎందుకు? గతంలో మెప్మా విభాగం నిర్వహించిన కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు లేకుండా నిర్వహించడం కూడా గళ్ళా మాధవి ప్రస్తావించారు. “హడావిడి అయిపోయిందని చెప్పడం సరైన సమాధానం కాదు. నాయకులను మర్చిపోయే స్థితి ఎందుకు వచ్చింది?” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రశ్నించారు. సమన్వయం లేకపోతే అభివృద్ధి జరగదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకుంటే రాష్ట్రం ముందుకు వెళ్లదు. ప్రజలు ఓటు వేసి ప్రతినిధులను ఎన్నుకుంటారు, ప్రజల పన్నులతో జీతాలు పొందే అధికారులు కూడా అదే ప్రజల సేవలో ఉండాలి. ఈ సమన్వయమే అభివృద్ధికి మూలం,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. 24వ డివిజన్ ప్రోగ్రామ్‌ గురించి నాకు తెలియదు. నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో చూసే వరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గము 24వ డివిజన్‌లో వేరే కార్యక్రమం జరిగిన విషయం నాకు తెలియలేదు. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? దానికి సమాధానం రావాలి,” అని గళ్ళా మాధవి అన్నారు. అధికారులు సమాధానం ఇవ్వాలి” అధికారులకు నేను ప్రశ్న వేసాను, ఆన్సర్ ఇవ్వాల్సింది అధికారులు. ఇది అమాయకత్వమా, లేక ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అంగీకరించట్లేదా అన్నది వారే చెప్పాలి. అందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాను,” అని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.“ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు నిబద్ధత చూపాలి” గుంటూరు పశ్చిమలో ఎన్నో సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని, తాను పదేపదే కౌన్సిల్ సమావేశాల్లో అడిగాను. వర్క్స్‌ ప్రాధాన్య క్రమంలో చేయండి. ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను ముందు దృష్టిలో పెట్టండి. కానీ కొన్నింటిపై మాత్రమే దృష్టి పెడుతున్నారు, మిగతావి విస్మరిస్తున్నారు. ఇది మారాలి,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యం కాంట్రాక్టర్లు, అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేయడం కాకుండా కలిసి పనిచేయాలి. ప్రజల కోసం మనం ఉన్నాము, అది గుర్తు పెట్టుకోవాలి,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button