
మొంథా తుఫాను ప్రభావం గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపించింది. అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులకు అపార నష్టం కలిగింది. అదేవిధంగా గుంటూరులో అనేక రహదారులు దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక కాలనీలలో వర్షపు నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. తక్షణమే పాలకులు స్పందించి రహదారులను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ప్రజలు రోగాలను బారిన పడకముందే పారిశుధ్యం మెరుగుపరచాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే పారిశుధ్యం మెరుగుపరచే విషయంలో నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా కనిపించింది. డ్రైన్ లలో తీసిన పూడికను ట్రాక్టర్ల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయితే డాక్టర్ నడిపే సిబ్బంది ట్రక్కులకు డోర్లు లేని విషయాన్ని కూడా మరిచారు. దీంతో ట్రక్కులో ఉన్న పూడిక మొత్తం రహదారుల పైన పడి ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ట్రక్కు లో ఉన్న పూడిక, గాజు సీసాలు, రాళ్లు మొత్తం రోడ్లపైన పడడంతో ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే కార్పొరేషన్ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







