
గుంటూరు నగరంలో ప్రధాన రోడ్ల వెంబడి, డ్రైన్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం రైల్ పేట, రత్నగిరి నగర్, సంగడి గుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్ ఆక్రమణలను, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్లు, డ్రైన్ల ఆక్రమణల వలన ప్రజల రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆక్రమణదారులకు స్వచ్చందంగా తొలగించుకోవాలని తెలియచేశామని, అయినపట్టికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆక్రమణలను పట్టణ ప్రణాళిక కార్యదర్శులు ఎప్పటికప్పుడు తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే రోడ్ల మీద బిర్యానీలు వండుతూ రోడ్ డ్యామేజి కారణంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని, వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, షాప్ లను సీజ్ చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పర్యటన ఎస్ఎస్ సాంబయ్య, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







