
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని గుంటూరు నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆజాద్ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ, “మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థ బలోపేతంలో చేసిన కృషి అద్వితీయమైనది” అని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలను, ‘నాడు-నేడు’, ‘అమ్మఒడి’ వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులకు అందించిన మేలును ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, వార్డ్ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







