
ఎన్టీఆర్ భరోసా – వృద్ధుల ముఖాల్లో వెలుగులు వస్తున్నాయని కమీషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే పెన్షన్ అందుతున్నందుకు వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. శనివారం కావేరి నగర్‌లో పెన్షన్ పంపిణీలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభమవ్వాలని, పంపిణీని లబ్దిదారుల ఇంటి వద్దనే జరిగేలా నోడల్ అధికారులు సమీక్షించాలి ఆదేశించారు.







