
గుంటూరు నగరాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఈమేరకు 48 కోట్లతో చేపట్టనున్న ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 41, 46, 47, 48 డివిజన్ల పరిధిలో 69 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహ్మద్ నసీర్, బి. రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. 3వ విడత ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ద్వారా గుంటూరు అభివృద్ధి మరింత శరవేగంగా జరుగుతుందని వారు వెల్లడించారు.







