chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపనకు గుంటూరు పశ్చిమ నుంచి భారీ బైక్ ర్యాలీతో హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

MLA MADHAVI BYKE RALLY IN GUNTUR

గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. పల్నాడు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు గుంటూరు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దీని ద్వారా నగరవాసులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిలిచిపోయిందని, భూసేకరణ సమస్యలు, నిధుల లేమితో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కీలక ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసిందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుంటూరు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker