
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ ఉద్యోగ నగర్‌లో గురువారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్తృతంగా పర్యటించారు. స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల సంజయ్ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ పక్కన ప్రజల నోటీస్‌లో లేకుండా ట్యాంకీ శంకుస్థాపన జరగడం వల్ల ఇళ్ల మధ్యలో ఉండటంతో హెవీ వాటర్ లారీల రాకపోకలతో రోడ్లు దెబ్బతినడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటం, స్థానికులకు అసౌకర్యం కలుగుతుందని నివాసితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ ఆర్చ్ పక్కనున్న ప్రదేశంలోనే ట్యాంకీ ఏర్పాటు చేయాలని ప్రజలు ఏకగ్రీవంగా సూచించారు. ఎందుకంటే అక్కడివరకు ఇప్పటికే వాటర్ మెయిన్ లైన్ ఉండటం, రాకపోకలు సులభంగా జరగటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ప్రజల సూచనలను గౌరవిస్తూ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలే కోరుకునే స్థలంలో ట్యాంకీ ఏర్పాటు చేసే దిశగా త్వరిత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానికులు కోరుతున్న గుడి స్థలాన్ని కూడా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.







