
నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా మయూర్ అశోక్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమీషనర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు అభివృద్ధే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీరు, రహదారులు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని,పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పని విధానాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.







