
నగరంలో అనధికారిక నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు మంగళవారం పాత గుంటూరు, పెద్దపలకలూరు , గోరంట్ల, హిమనీ నగర్, రెడ్డిపాలెం, బ్రాడీపేట ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ జీవో ప్రకారం 30 ఆగస్టు 2025 తరవాత జిఎంసి పరిధిలో ప్లాన్ లేకుండా నిర్మాణం చేసిన కట్టడాలను తొలగిస్తున్నారన్నారు. జిఎంసి పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే, వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ డ్రైవ్ ప్రతిరోజు జరుగుతుందని, నిర్దేశిత అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో కూల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే వార్డ్ సచివాలయాల వారీగా అనధికార, ప్లాన్ కి విరుద్ధంగా చేస్తున్న నిర్మాణాలను గుర్తించామని తెలిపారు.







