
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ మంగళవారం అంటే గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయం మహిళలతో కళకళలాడుతుంది. మహిళా గ్రీవెన్స్‌ను పూర్తిగా ఓపెన్ వేదికగా నిర్వహిస్తూ, మహిళలు నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన ప్రతి సమస్యపై సానుకూల దృక్పథంతో స్పందిస్తూ, సాధ్యమైన పరిష్కారాలు, అవసరమైన వర్క్స్, ఫాలోఅప్స్‌ను చేపడుతున్నాం. మహిళలకు ఒక ఊరట కలిగించడమే కాదు, సమస్యలు పరిష్కరించి వారికి ఆనందం ఇవ్వడమే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు సమస్య రహితంగా, ఆర్థికంగా బలంగా, గౌరవంగా, స్వావలంబనతో ముందుకు సాగాలి అనే సత్సంకల్పంతో ఈ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మహిళలు అందరూ ఈ గ్రీవెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.







