
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి చేతుల మీదుగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో 72 మందికి గాను మొత్తం రూ.77 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆపన్నులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు ఊరట కల్పిస్తున్నారని, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల క్షేమానికే కృషి చేస్తుంటారు. ఆయన దీవెనలతో ఈరోజు అనేకమంది వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సాయం పొందుతున్నారని తెలిపారు.కేవలం గత ఒకటిన్నర సంవత్సర కాలంలోనే పశ్చిమ నియోజకవర్గంలోని 337 మందికి రూ.4 కోట్లు 63 లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను అందజేశాం. ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఈ సాయం తమ జీవితాల్లో గొప్ప ఊరటగా భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయపరిచే నాయకుడు చంద్రబాబు నాయుడేనని, ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటుంది,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.







