
గుంటూరును పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కమీషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ఈమేరకు పరిశుభ్రత కోసం ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. నగరంలో ఇళ్ల నుండి ఇచ్చే వ్యర్ధాలు తడిపొడిగా వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఇంటి, గృహ సముదాయాల పరిధిలో హోం లేదా క్లస్టర్ కంపోస్ట్ తయారు చేసుకోవాలి. నగరంలో రోడ్లు, ఫుట్ పాత్ ల పై అనధికార మాంస, చేపల విక్రయాలు నిషేధం. ప్రజలు తమ ఇళ్లల్లో ఉండే నిరుపయోగ వస్తువులను, బట్టలను రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో వేయకుండా సమీప సచివాలయంలోని ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో అందించాలని కోరిన కమిషనర్ పులి శ్రీనివాసులు.







