
తక్కెళ్లపాడులోని గుంటూరు నగర పాలక సంస్ధ హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్ కి వెళ్లే ప్రధాన పైప్ లైన్ పై ఏర్పడిన లీకు మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే పూర్తి చేసి సరఫరా పునరుద్ధరణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం హెడ్ వాటర్ వర్క్స్ లో జరుగుతున్న పైప్ లైన్ లీకు మరమత్తు పనులను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ నిలిపివేయడం వలన 90 శాతం నగరనికి త్రాగునీటి సరఫరా నిలిచిపోతుందన్నారు. కనుక మరమత్తు పనులను నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ గడువుకి ముందే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఈఈ కోటేశ్వరరావు నేరుగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.







