
మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి తక్షణం నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మొంథా జిల్లా మరియు ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్.పి.సిసోడియా ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో సమావేశ మందిరంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, నగర పాలక కమిషనర్ పులి శ్రీనివాసులు , సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి జిల్లా అధికారులతో మొంథా తుఫాన్ వలన కలిగిన నష్టం పై సమీక్షించారు. GUNTUR NEWS: అమ్మ చనిపోదాం అంటోంది కలెక్టర్ మేడం – జీవనోపాధి చూడండి
జిల్లాలో తుఫాన్ వలన ఆస్తి, పంట నష్టం, పశు నష్టం ,గృహాల నష్టం పై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 22 వేల హెక్టార్ల లో పంట నష్టం అంచనాలపై శాస్త్రవేత్తల బృందంతో వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనలో ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. విద్యుత్ అధికారులు బుధవారం సాయంత్రానికి విద్యుత్ ని పునరుద్దరించడం జరిగిందని తెలిపారు. జిల్లా పంచాయితీ అధికారి బి.వి. నాగసాయి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అన్నీ గ్రామాలలో శానిటేషన్ చేస్తున్నామని, సూపర్ క్లోరినేషన్ చేస్తున్నామని తెలిపారు. 228 ట్యాంకులను క్లోరినేషన్ చేయడం జరిగిందని, ఎక్కడైనా గ్రామాలలో నిల్వ వున్న నీటిని బయటకు పంపిస్తున్నామని తెలిపారు. పశు సంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ 18 మండలాలో తుఫాన్ పై విసృతంగా అవగాహన కల్పించడం పై పశు నష్టం ఎక్కువగా లేదని కొన్ని పశువులు చనిపోయిన వాటిని గురించి అధికారులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. GUNTUR NEWS: విద్య వ్యవస్థలో మార్పులు ..
ఆర్.డబ్ల్యూఎస్ అధికారి మాట్లాడుతూ తుఫాన్ వలన డామేజ్ ఏమి లేదని ఎప్పటికప్పుడు నీటి నమూనాలు సేకరించి పరిక్షించడం జరుగుతుందని అన్నారు. నగర పాలక సంస్ధ కమిషనర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగలేదని తెలిపారు. Guntur: ఏఎమ్ రత్నం వర్సెస్ కె.ఎల్.నారాయణ – అధిపత్యపు పోరులో ఆగిన ఎఫ్.డి.సి. చైర్మన్ నియామకం
ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ వర్షాల వలన కెనాల్స్ ఓవర్ ప్లో అయ్యాయని కెనాల్స్ కు , టాంకులకు ప్రమాదం లేదని కృష్ట వెష్ట్రన్ డెల్టాలో కొన్ని డ్రైన్స్ డామేజ్ అయ్యాయని వివరించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మాట్లాడుతూ రైతులకు పంట నష్ట పరిహారం త్వరగా అందించేందుకు వ్యవసాయ అధికారులు త్వరితగతిన ఎన్యూమరేషన్ ను పూర్తి చేయాలన్నారు.
అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి తుఫాన్ నష్ట అంచనాలను సేకరించి నివేదికను త్వరిత గతిన అందజేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో వున్న వారికి ఇంటికి తిరిగి వెళ్ళే టప్పుడు ఒక వ్యక్తి అయితే వెయ్యి రూపాయలు , ముగ్గురు ఆపై సభ్యులు గల కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలని, తమకు డబ్బుతో పాటు బియ్యం, నూనె, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, పామ్ ఆయిల్ తో కూడిన కిట్టులను అందించాల్సివున్నదని, పునరావాస కేంద్రాలలో వున్న వారి వివరాలను నమోదు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె ఖజావలి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వి.జ్యోతి బసు, పశు సంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణ, డి.ఏం.అండ్ హెచ్ ఓ. డా. విజయలక్ష్మి, ఏ.పి.ఏం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎల్. వజ్రశ్రీ, హౌసింగ్ పి.డి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఇ కె.కళ్యాణ్ చక్రవర్తి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి. చెన్నయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.







