chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: తుఫాన్ బాధితులకు ప్రభుత్వ సాయం పంపిణీ చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

MLA MADHAVI DISTRIBUTION FOR FLOOD AFFECTED PUBLIC

తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం పంపిణీ చేశారు. ఏటి అగ్రహారం ప్రాంతంలోని రేషన్ షాపు వద్ద బాధితులకు ప్రభుత్వం తరపున బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, పంచదార, ఉల్లిపాయలు వంటి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గత రెండు మూడు రోజులుగా ఏపీ ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని కలిసికట్టుగా చాలా సమర్ధవంతంగా ఈ మొంథా తుఫాన్‌ని ఎదుర్కొన్నాము. GUNTUR NEWS.:లభించిన బాలు మృతదేహం..

సీఎం చంద్రబాబు, పార్టీ లోకేష్ , పవన్ కళ్యాణ్ నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఈ తుఫాన్‌ని ఎంత ప్రణాళికబద్ధంగా ఎదుర్కొన్నామో ప్రజలందరూ చూశారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్దగా లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కొంతమంది లోతట్టు ప్రాంత ప్రజలు ముంపుకు గురయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 325 మంది తుఫాన్ బాధితులు గత రెండు రోజులుగా రిహాబిలిటేషన్ సెంటర్లలో ఆశ్రయం పొందారు. బాధితులందరికీ ప్రభుత్వం తరఫున ఈరోజు ఏటి అగ్రహారంలో 60 మందికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం. పంపిణీ చేయటం జరిగిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.అధికారులు, స్థానిక డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరం కలిసి బాధిత కుటుంబాలందరికీ సరుకులు అందేలా చూస్తామన్నారు. 2025 CALENDER

కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ప్రజలు ఈ సహాయక చర్యల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. కిందస్థాయి కార్యకర్తల నుండి సీఎం వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షించారు. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించారు. మా కార్యకర్తలు, కార్పొరేటర్లు ప్రజలతోనే ఉండి సేవ చేశారు. అందుకే ఈ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోగలిగాము,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. GUNTUR NEWS:రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన

ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఎప్పటికీ నిలబడే ప్రభుత్వం. అందుకే ప్రజలు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికే జై కొడతారు. ఈ తుఫాన్ సహాయక చర్యల్లో మాకు అండగా నిలిచిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ , ఎంఆర్ఓ , ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. తుఫాన్ అనంతరం అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్, సిల్టేషన్, శానిటేషన్ సమస్యలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి అంశాలను రెండు మూడు రోజుల్లోనే అధికారులు సమర్ధవంతంగా పరిష్కరించారు. ఇకపై ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో శుభ్రత, విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతాయి,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చారు.

Author

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)
Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Product
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Product
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker